జేఏసీ కార్యాలయం వద్ద నిరసన: కోదండరాం
- Details
- Category: రాష్ట్రీయం
-
27 Jan 2013
- Published on Sunday, 27 January 2013 16:11
సమరదీక్షకు అనుమతి వచ్చే వరకు జేఏసీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని చుక్కా రామయ్య కలిసి సమరదీక్షకు అనుమతి కావాలని కోరారని ఆయన తెలిపారు. అయితే సమరదీక్ష అనుమతిపై నిర్ణయానికి అరగంట సమయం కావాలని హోంమంత్రి అన్నారని.. అప్పటి వరకు జేఏసీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.











