మా సత్తా ఏంటో చూపిస్తాం: కోమటిరెడ్డి
- Details
- Category: రాష్ట్రీయం
-
25 Jan 2013
- Published on Friday, 25 January 2013 13:22
ప్రభుత్వాన్ని కూలుస్తామని భయపెట్టి సీమాంధ్రులు తెలంగాణను అడ్డుకున్నారని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ వాదులుగా మా తడాఖా ఏంటో చూపిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. వాయిదాలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కేంద్రం తెలంగాణ ఇస్తుందో లేదో అని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ అధినేత కెసీఆర్‌ను కలిసిన అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రకటనపై ఎల్లుండి వరకూ వేచి చూస్తామని, ప్రకటన వెలువడకుంటే 28 తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయని కోమటిరెడ్డి హెచ్చరించారు.











