విప్ పదవికి పేర్ని నాని రాజీనామా
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Jan 2013
- Published on Thursday, 24 January 2013 14:13
ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. ఆయన గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కేంద్రం, కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. కష్టకాలంలో వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
జగన్కు అండగా ఉండమని ప్రజలు కోరుకుంటున్నారని, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్ అభిమానుల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాని పేర్కొన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు.











