Tue21052013

Last updateTue, 21 May 2013 12pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం జగన్ బెయిల్పై తీర్పు 24కు వాయిదా

జగన్ బెయిల్పై తీర్పు 24కు వాయిదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. భోజనవిరామం తర్వాత జగన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, సిబిఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ అశోక్ భాను తమ వాదనలు వినిపించారు.


ఒక్క సీసీ8 లోనే కాకుండా, అన్ని అంశాలకు సంబంధించి జగన్ను రిమాండ్లోకి తీసుకున్నారని నిరంజన్ కోర్టుకు తెలిపారు. కేవలం దాఖలుచేసిన ఛార్జిషీటుకు సంబంధించి మాత్రమే రిమాండ్లోకి తీసుకోలేదన్నారు. వీలైనంత త్వరలో దర్యాప్తు పూర్తిచేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పిందని, అయితే దర్యాప్తు ముగింపునకు అంతం ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. ఎంతకాలం అంటే అంతకాలం జగన్ను జైలులో ఉంచుతారా? అని అడిగారు. 90 రోజులకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టడీలో ఉంచకూడదని ఆయన వాదించారు.

దర్యాప్తు పూర్తిచేయడానికి సమయం పడుతుందని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. ఎంతకాలం పడుతుంది? ఎన్నేళ్లు పడుతుంది? అని సీబీఐపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు పూర్తిచేయడం కష్టంగా ఉందని సీబీఐ తెలిపింది. దర్యాప్తునకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందడంలేదని చెప్పింది. ఈ విషయాన్ని చెప్పడానికి తాము సంకోచించడంలేదని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM