ఎంపీ అసదుద్దీన్కు 2వరకూ రిమాండ్
- Details
- Category: రాష్ట్రీయం
-
21 Jan 2013
- Published on Monday, 21 January 2013 13:26
కలెక్టర్ను దూషించిన కేసులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్కు సంగారెడ్డి కోర్టు ఫిబ్రవరి 2వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. ఆయన సోమవారం సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. అసదుద్దీన్కు రిమాండ్ విధించటంతో ఆయనను పోలీసులు సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు అసదుద్దీన్ తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈకేసుపై విచారణ రేపటికి వాయిదా పడింది.
కాగా అసదుద్దీన్ లొంగుబాటుతో హైదరాబాద్లో హైఅలర్ట్ విధించారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఉన్నతాధికారులు హెచ్చరించారు.











