లగడపాటి అరెస్ట్కు రంగం సిద్ధం
- Details
- Category: రాష్ట్రీయం
-
21 Jan 2013
- Published on Monday, 21 January 2013 09:56
విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అరెస్ట్కు రంగం సిద్ధమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్రను అడ్డుకుంటామన్న నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నద్ధం అయ్యారు. కృష్ణాజిల్లా అనుమంచిపల్లిలో లగడపాటి బస చేసిన నివాసం వద్ద పోలీసులు మోహరించారు. అయితే ఆయన తాళం వేసుకుని ఇంట్లోనే ఉన్నారు. ముందస్తుగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు నాయుడు చేస్తున్న మీకోసం యాత్ర జిల్లాలో ప్రవేశించకముందే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణకు అనుకూలంగా బాబు లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని అడ్డుకుని తీరతామని సమైక్యవాదులు ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా చంద్రబాబుకు స్వాగతం పలికి ఆయనకు కనువిప్పు కలిగిస్తానని ప్రకటించారు.











