ప్రపంచ తెలుగు మహాసభలకు సినీ నటుల ప్రత్యేక ఆకర్షణ
- Details
- Category: రాష్ట్రీయం
-
29 Dec 2012
- Published on Saturday, 29 December 2012 12:00
ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు వారంతా ఒక్క చోట చేరి తెలుగు దనం ఉట్టిపడెలా సంబరాలు చేసుకొంటున్నారు. సభల్లో తెలుగు సినీ ప్రముఖులు సందడి చేస్తున్నారు.
ప్రపంచ తెలగు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన తెలుగువారు పండగ జరుపుకుంటున్నారు. సభల రెండో రోజు తెలుగు సినీ నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరుచూరి బ్రదర్స్, రామానాయుడు, మురళీమోహన్, కృష్ణంరాజు, తనికెళ్లభరణి, వందేమాతరం శ్రీనివాస్, ఇతర నటులు సభల్లో సందడి చేశారు. పరుచూరి బ్రదర్స్ నేతృత్వంలో తెలుగు భాషను బ్రతికించుకుందాం అనే నాటికను ప్రదర్శించారు.....











