సమస్యకు పరిష్కారం కోరాం: వైఎస్ఆర్సీపీ
- Details
- Category: రాష్ట్రీయం
-
28 Dec 2012
- Published on Friday, 28 December 2012 18:08
తెలంగాణ అంశంపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తెలంగాణపై ఎన్ని పార్టీలు ఏమీ చెప్పినా ప్రయోజనం లేదని, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజనపై సర్వాధికారాలు కేంద్రానివేనని ఆపార్టీ పేర్కొంది. కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోందని, ఇప్పటికైనా అన్ని విషయాలు, అన్ని సమస్యలు కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రజల మనోభావాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందని వెల్లడించింది. ఈ సమస్యకు ఓ తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం చూపాలంటూ షిండేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చింది.











