స్పష్టమైన అభిప్రాయం చెప్పాం: బీజేపీ
- Details
- Category: రాష్ట్రీయం
-
28 Dec 2012
- Published on Friday, 28 December 2012 15:36
తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన అభిప్రాయం చెప్పామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై రోడ్ మ్యాప్ ప్రకటించాలని షిండేను కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తుందని చెప్పామని కిషన్ రెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు రెండు అభిప్రాయాలు వెల్లడించారని ఆయన తెలిపారు.











