వైఎస్ఆర్ మాజీ పీఎస్ కిరణ్ మృతి
- Details
- Category: రాష్ట్రీయం
-
26 Dec 2012
- Published on Wednesday, 26 December 2012 12:03
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్‌ఆర్ సీపీ కోశాధికారి పీఆర్.కిరణ్‌కుమార్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా దామర మడుగు. చిన్నతనం నుంచే సేవాతత్వం కలిగిన కిరణ్‌కుమార్‌రెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డితో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన వైఎస్ఆర్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఆరోగ్యశ్రీ వ్యవహారాలను పర్యవేక్షించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రోగులకు సాయం అందించారు. కాగా కిరణ్కుమార్ రెడ్డి భౌతిక కాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భారతి, వైవీ సుబ్బారెడ్డి దంపతులు నివాళులు అర్పించారు. ప్రజల సందర్శనార్థం ఈరోజు ఉదయం పదిన్నరకు వైఎస్ఆర్ సీపీ కార్యాలయానికి కిరణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తారు.











