అర్థరాత్రి ఒంటరిగా తిరుగుతామా: బొత్స
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Dec 2012
- Published on Monday, 24 December 2012 16:30
ఢిల్లీ అత్యాచార ఘటనపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది కదా అని... ఒంటరిగా తిరగలేం కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రయివేటు బస్సులో రాత్రి పూట అమ్మాయి ప్రయాణించుకుండా ఉంటే బాగుండేదని, ఈ విషయంతో తనను తప్పుబట్టినా... అమ్మాయిలు పరిస్థితులను చూసుకుని వ్యవహరించాలన్నారు. ఢిల్లీ ఘటనను ఓ పక్క ఖండిస్తూనే మరోవైపు సమస్య చిన్నదైనప్పటికీ సోనియాగాంధీ ఆందోళనకారులతో చర్చలు జరిపారంటూ చెప్పుకొచ్చారు. సోనియా స్పందించటం గొప్ప విషయమన్నారు.
'రేప్' వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న బొత్స: -
దేశరాజధానిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉపసంహరించుకున్నారు. అమ్మాయిల విషయంలో తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నదే తన ఉద్దేశమని బొత్స వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని బొత్స కోరారు.











