Wed19062013

Last updateWed, 19 Jun 2013 4pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం ఆకట్టుకుంటున్న వైఎస్సాఆర్ కుటుంబసభ్యుల చిత్రాలు

ఆకట్టుకుంటున్న వైఎస్సాఆర్ కుటుంబసభ్యుల చిత్రాలు

శ్రీకాళహస్తి ఇండస్ట్రియల్‌ ఏరియాలో గోడచిత్రాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. గోడపై అత్యద్భుతంగా చిత్రీకరించిన మహానేత వైఎస్సార్‌, ఆయన కుటుంబసభ్యుల చిత్రాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.....
ఈ పెయింటింగ్స్‌ని చూడండి. ఎంతో బాగున్నాయో. మహానేత వైఎస్, ఆయన సతీమణి విజయమ్మ, జగన్‌, షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం, జగన్మోహన్‌రెడ్డి దీక్షలు, పర్యటనలు, యాత్రలు, షర్మిల మరో ప్రజాప్రస్థానం వరకు అన్ని విశేషాలను అత్యంత రమణీయంగా ఈ గోడలపై చిత్రీకరించారు.

శ్రీకాళహస్తి-తిరుపతి రోడ్డుపై ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఓ ఫ్యాక్టరీ గోడలపై ఈ చిత్రాలను శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డి వేయించారు. వైఎస్‌ కుటుంబ చిత్రాలతో పాటు మధుసూదన్‌రెడ్డి చేస్తున్న సేవాకార్యక్రమాలను కూడా చిత్రాల్లో పొందుపరిచారు. చెన్నైకి చెందిన ఓ ప్రముఖ చిత్రకారుడు రెండు నెలలు కష్టపడి పెయింటింగ్స్‌కు ప్రాణం పోశాడు.
అత్యంత రమణీయంగా ఉన్న ఈ చిత్రాలు దారినపోయేవారిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా కాళహస్తి-తిరుపతి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు కాసేపాగి మరీ చిత్రాలను వీక్షిస్తున్నారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM