ఐటీ అధికారులకు గడ్కరీ హెచ్చరిక
- Details
- Published on Thursday, 24 January 2013 19:52
కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవని ఆదాయపన్ను శాఖ అధికారులను బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, చిదంబరం(ఆర్థిక మంత్రి) కూడా మిమ్మల్ని కాపాడలేరంటూ గద్దించారు. అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత తొలిసారి ఇక్కడి వచ్చిన ఆయన నాగపూర్ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఐటీ అధికారులను కాంగ్రెస్ పావులా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.











