తెలంగాణపై త్వరలో నిర్ణయం: దిగ్విజయ్
- Details
- Published on Monday, 21 January 2013 14:55
తెలంగాణపై కేంద్రం త్వరలో నిర్ణయం ప్రకటిస్తుందని ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం సీమాంధ్ర ప్రాంత నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాలు చూడటం లేదని తెలిపారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేనే తెలంగాణపై నిర్ణయం చెబుతారని ఆయన అన్నారు. ఇటీవలే షిండే అఖిలపక్షం నిర్వహించారని, కాంగ్రెస్ వైఖరి ఏంటో హోంమంత్రికి తెలుసునని దిగ్విజయ్ వెల్లడించారు.











