ఢిల్లీ అత్యాచారబాధితురాలి మృతి
- Details
- Published on Saturday, 29 December 2012 09:22
దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఈ నెల16 ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్‌లో సామూహికంగా అత్యాచారానికి గురైన ప్యారామెడికల్ విద్యార్థిని మృతి చెందింది. ఆమెకు మెరుగైన చికిత్స కోసం సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడే చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.15 గంటలకు మృతి చెందింది.











