ముగిసిన అఖిలపక్ష సమావేశం
- Details
- Published on Friday, 28 December 2012 12:20
తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో ఎనిమిది రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కేంద్ర హోంమంత్రి షిండే మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కాగా అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో ఢిల్లీ నార్త్‌బ్లాక్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తెలంగాణవాదులను ఖాళీ చేయించారు. తెలంగాణ ఉద్యోగ సంఘం నేతలు, పలు ప్రజా సంఘాల నేతలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు.











