అంగరంగ వైభవంగా మోడీ ప్రమాణస్వీకారోత్సవం
- Details
- Published on Wednesday, 26 December 2012 11:56
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ కమల్ బేనీవాల్ బుధవారం ఉదయం ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. 2001 సంవత్సరం నుంచి అధికారంలో కొనసాగుతున్న మోడీ ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 186 నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని పూర్తి మెజారిటీని కైవసం చేసుకుంది. మణినగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మోడీ 84 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయఢంకా మోగించారు.
మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్, బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, ఎల్ కె అద్వానీ, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, గడ్కరీ, వెంకయ్యనాయుడు, ఓం ప్రకాష్ చౌతాల, ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులు హాజరయ్యారు.











