ఆన్ లైన్ బుకింగ్ కి ఫుల్ డిమాండ్
- Details
- Published on Saturday, 29 December 2012 15:03
2008 నుంచి బస్ టికెట్ బుకింగ్‌లో ఇంటర్నేట్‌ను యూజ్ చేస్తున్నారు ప్రయాణీకులు. ప్రస్తుతం 44శాతం మంది టికెట్ బుకింగ్‌కోసం ఆన్‌లైన్‌ను వినియోగిస్తుండగా 9 శాతం మంది మాత్రమే ఏజెంట్ ద్వారా టికెట్లు కొంటున్నారు. ఇక 46శాతం టికెట్లు నేరుగా ఆపరేటర్ల దగ్గర బుక్ చేసుకుంటున్నట్లు డేటా చెపుతోంది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటే పండుగల , ఎమర్జెన్సీ సందర్భాలలో టికెట్ల ధరలు పెరగవు. సీట్లు కూడా ముందుగానే ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకోవచ్చని ఆన్‌లైన్ బుకింగ్ సంస్ధలు చెపుతున్నాయి. పైగా పండుగల సమయంలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ప్రత్యేకమైన డిస్కౌంట్స్, గిఫ్ట్‌లు ఇవ్వడం కూడా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు క్రేజ్ పెంచుతోంది.
ఇక ఇండియాలో ప్రైవేటు బస్ ట్రావెల్ ఇండెస్ట్రీ 30శాతం వృద్ధితో 2015నాటికి 35వేల నుంచి 40వేల కోట్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ఎపి వాటా 20వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక ముందు ముందు మొబైల్ ,ట్యాబ్లెట్ లో సైతం టికెట్ బుకింగ్ సదుపాయంవస్తే వీటి మార్కెట్ భారీ స్ధాయిలో పెరిగే అవకాశం ఉంది.














